
సీపీఆర్‌తో ప్రాణాలు కాపాడొచ్చు
నారాయణపేట: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ప్రజలతో ప్రత్యక్షంగా పనిచేస్తారు.. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించడానికి సిపిఆర్ పద్ధతులు తెలుసుకోవడం ఎంతో అవసరమని, సీపీఆర్ శిక్షణను సద్వినియం చేసుకోవాలని ఎస్పీ డాక్టర్ వినీత్ పోలీసులకు సూచించారు. శనివారం ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్‌న్స్ హాల్లో లైఫ్ సేవర్ అసోసియేషన్ ఢిల్లీ వైద్య నిపుణుడు డాక్టర్ రాకేష్ సీపీఆర్ చేసే విధానంపై ప్రాక్టికల్‌గా జిల్లా పోలీసులకు అవగాహన కల్పించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది అత్యవసర సమయంలో ఆస్పత్రికి వెళ్లేలోపు గుండె సమస్య ఉన్న, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్న వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఎక్కడైనా ఆపద వస్తే వెంటనే వెళ్లేది పోలీసులు ఆ తర్వాత 108 సిబ్బంది అని, ప్రతి ఒక్కరు సిపిఆర్ నేర్చుకుంటే తప్పకుండా ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్లం అవుతామని సూచించారు.
అత్యవసర ప్రక్రియ..
డాక్టర్ రాకేష్ మాట్లాడుతూ.. సీపీఆర్ అనేది చాతీ కుదింపులతో కూడిన అత్యవసర ప్రక్రియ అన్నారు. ఇది తరచుగా కృత్రిమ వెంటిలేషన్‌న్‌తో ఆకస్మిక రక్త ప్రసరణ, శ్వాసను పునరుద్ధరించడానికి చర్యలు తీ సుకోబడుతుందని అన్నారు. డీఎంహెచ్‌ఓ జయ చంద్ర మోహన్, విజయ్ కుమార్,ఆర్‌ఐ నరసింహ, ఎస్సైలు నరేష్, పురుషోత్తం పాల్గొన్నారు.