
అభిప్రాయంతోనేడీసీసీ అధ్యక్షుడి ఎన్నిక
నారాయణపేట: ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమం ద్వారా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ నాయకులు, పార్టీ ప్రతినిధుల అభిప్రాయాలతోనే డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఏఐసీసీ నేతృత్వంలో టీపీసీసీ ఆధ్వర్యంలో తుది నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ పరిశీలకులు, ఎమ్మెల్సీ నారాయణస్వామి స్పష్టం చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని సీవీఆర్ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల సీనియర్ నాయకులతో డీసీసీ అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలో స్థానిక నాయకులు, కార్యకర్తలతో ప్రత్యక్షంగా సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకొని ఈ నెల 22న ఏఐసీసీకి నివేదిక అందజేస్తామన్నారు. 13, 14, 15 తేదీల్లో జిల్లా కేంద్రంలోనే ఉండి గ్రూపులు, వ్యక్తిగతంగా పార్టీలోని అందరి అభిప్రాయలు సేకరిస్తామన్నారు. డీసీసీ ఎన్నికల్లో అరుగురు అభ్యర్థులు పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పార్టీ పునర్నిర్మాణ దిశగా ముందడుగు వేస్తుందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలు, నాయకులకు తప్పకుండా పదవులు వస్తాయని పేర్కొన్నారు. రాష్ట్ర మత్స్య సహకార శాఖ అధ్యక్షుడు మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడిన అతి సామాన్య కుటుంబానికి చెందిన తనను సీఎం రేవంత్‌రెడ్డి గుర్తించి అతి చిన్న వయస్సులో రాష్ట్ర చైర్మన్ పదవి కట్టబెట్టారన్నారు. సమావేశంలో మార్కెట్ చైర్మన్ ఆర్ శివారెడ్డి, పోషల్ రాజేష్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, ప్రసన్నరెడ్డి, ఎండీ సలీం, బండి వేణుగోపాల్, సరాఫ్‌నాగరాజు, సుధాకర్, మనోహర్‌గౌడ్ పాల్గొన్నారు.
‘హిందుత్వం జీవన విధానం’
నారాయణపేట టౌన్: హిందుత్వం జీవన విధానమని, సనాతన ధర్మంతో విశ్వశాంతి చేకూరుతుందనిసంస్కార భారతి ప్రాంత సహ కార్యదర్శి చక్రవర్తి వేణుగోపాల్ అన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో శనివారం నిర్వహించిన పథ సంచలన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్ ఏర్పడి వందేళ్లు పూర్తయినా సందర్భంగా దేశవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా శనివారం సాయత్రం 4.30 గంటలకు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు యూనిఫాం ధరించి జిల్లా కేంద్రంలోని పరిమళపూర్ హనుమాన్ మందిరం నుంచి కవాతు ప్రారంభించి సరాఫ్ బజార్, సెంటర్ చౌక్, సుభాస్ రోడ్, వీరసావర్కర్ చౌరస్తా, సత్యనారాయణ చౌరస్తా, కొత్త బస్టాండ్ మీదుగా ర్యాలీ కొనసాగించి శ్రీగార్డెన్‌కు చేరుకున్నారు. సంఘ్ సేవకులు చేసిన కవాతు చూపరులను ఆకట్టుకుంది. ప్రధాన వీధుల గుండా కవాతు నిర్వహించిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలకు పట్టణ యువత పూలతో అడుగడుగునా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చక్రవర్తి మాట్లాడుతూ దేశ అభివృద్ధి, హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలన్నారు. కార్యక్రమంలో వరలక్ష్మి సరోదే, నగర సంఘ చాలక్ డాక్టర్ మదన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.

అభిప్రాయంతోనేడీసీసీ అధ్యక్షుడి ఎన్నిక