
యువతకు జీవితం..
నేను పీయూలో చదువుకునే క్రమంలో గ్రూప్–2కు సిద్ధ మయ్యాను. అప్పుడు అక్క డ ఉండే వసతులు చాలా వినియోగించుకున్నాం. అప్పటి రిజిస్ట్రార్ వెంకటాచలం, అధ్యాపకులు గాలెన్న ఎంతో సహకరించారు. మాతోపాటు చదువుకున్న ఎంతో మంది విద్యార్థులు సైతం ఉద్యోగాలు సాధించారు. పీయూ 4వ స్నాత కోత్సవం జరపుకోవడం చాలా గొప్ప విషయం. చాలా మంది యువతకు జీవితాన్ని ఇచ్చింది.
– పరమేశ్వర్‌గౌడ్, ఎకై ్సజ్ సీఐ, పటాన్‌చెరు
స్థిరపడేందుకు ప్రోత్సాహం..
పీయూలో చదువుకునేందు కు, పోటీ పరీక్షలకు సిద్ధమ య్యేందుకు చక్కటి వాతావ రణం ఉంది. అక్కడ లైబ్రరీ, స్టడీహాల్, కంప్యూటర్ ల్యాబ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అధ్యాపకు లు స్నేహపూర్వకంగా ఉంటూ అన్ని సందేహాలను నివృత్తి చేసి, ప్రతి విద్యార్థి జీవితంలో స్థిరపడే విధంగా ప్రోత్సహిస్తున్నారు. – అనిల్‌కుమార్,
పీజీటీ, బీసీ గురుకులం, జూబ్లీహిల్స్
అధికారుల సహకారంతో..
పీయూలో వివిధ సబ్జెక్టుల్లో పీజీ వరకు చదివిన అనేక మంది విద్యార్థులు ఉద్యోగా లు సాధించి జీవితంలో స్థిరపడ్డారు. అందుకోసం స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాం. అందుకోసం యూనివర్సిటీ అధికారులు సైతం ఎంతో సహకరించారు.
– భూమయ్య, స్టడీ సర్కిల్ డైరెక్టర్, పీయూ
సదుపాయాలు బాగున్నాయి..
పీయూలో 2013– 15 బ్యాచ్ లో నేను ఎంఎస్‌డబ్ల్యూ చదివాను. ఈ క్రమంలో అప్పటికే లైబ్రరీలు, స్టడీ హాల్ వంటి సదుపాయాలు బాగానే ఉన్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అక్కడి అధ్యాపకులు, అధికారులు ఎంతో ప్రోత్సహించడంతో పోటీ పరీక్షలపై అవగాహన పెంచుకున్నాం. దీంతో పీజీ పూర్తి అయిన వెంటనే ఉద్యోగం సాధించి జీవితంలో స్థిరపడ్డాను.
– మల్లేష్, జూనియర్ లెక్చరర్, వనపర్తి కళాశాల
●

యువతకు జీవితం..

యువతకు జీవితం..

యువతకు జీవితం..