
ఇకనైనా.. పెరిగేనా?
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలకు వస్తున్న టెండర్లలో పాలమూరు అగ్రస్థానంలో ఉండగా చివరి స్థానంలో వనపర్తి జిల్లా నిలిచింది. సోమవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 187 దరఖాస్తులు వచ్చాయి. మద్యం దుకాణాలకు దరఖాస్తులు చేసుకోవడానికి మరో ఐదు రోజుల వ్యవధిలో టెండర్లు ఏ స్థాయిలో పెరుగుతాయి అనే టెన్షన్‌లో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు. గతంలో ఎప్పుడూ కూడా చివరి ఐదు రోజుల్లో దరఖాస్తులు అమాంతం పెరిగిన సందర్భాలు ఉండగా.. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటుందా అనేది చూడాలి. రెండేళ్ల కిందట జరిగిన దరఖాస్తుల స్వీకరణలో మహబూబ్‌నగర్ సర్కిల్ పరిధిలో ఉన్న దుకాణాలకు మొత్తం 1,308 టెండర్లు రాగా.. ఇందులో చివరి మూడు రోజుల్లోనే 1,123 దరఖాస్తులు వచ్చాయి. మిగిలిన రోజుల్లో వచ్చినవి కేవలం 200లోపే.. ఈసారి కూడా అదే ట్రెండ్ కొనసాగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలోని 14 సర్కిళ్ల పరిధిలో ఉన్న సీఐలు టెండర్లు పెంచుకోవడానికి కావాల్సిన కసరత్తు సైతం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలోని 227 దుకాణాలకు 455 టెండర్లు దాఖలు
అత్యధికంగా పాలమూరులో, అత్యల్పంగా వనపర్తిలో..
చివరి మూడు రోజుల్లోజోరందుకుంటాయని ఆశాభావం