
సబ్సిడీపై ఇవ్వాలి
ప్రభుత్వం సన్న, చిన్నకారు రైతులకు సబ్సిడీపై అందించే టార్ఫాలిన్లను నిలిపివేయడం సరికాదు. దీంతో ఆరుకాలం కష్టపడి పండించి రైతుల ధాన్యం వర్షార్పణం అవుతోంది. ఖాళీ యూరియా సంచులతో కుట్టిన వాటిని రోజుకూ రూ.30 చొప్పున అద్దెకు తీసుకొనే ధాన్యాన్ని వర్షం నుంచి కాపాడుకుంటున్నాం. పథకం మళీ ప్రారంభిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– రాజు, గుడిగండ్ల
అధికారుల నిర్లక్ష్యం
వ్యవసాయ అధికారు లు ఉన్నతాధికారులకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో టార్ఫాలిన్లు రైతులకు అందడం లేదు. రైతు లు పడుతున్న బాధలు చూసినా అధికారులు ప్రభుత్వానికి నివేదించాలి. రూ.వేలు ఖర్చుపెట్టి టార్ఫాలిన్లు కొనుగోలు చేసుకుంటున్నాం. రైతులపై భారం తగ్గించాలి.
– గోవిందురాజు, దాసర్‌దొడ్డి
ప్రభుత్వం అందిస్తే..
ప్రభుత్వం నుంచి సబ్సిడీపై టార్ఫాలిన్లు వస్తే రైతులకు పంపిణీ చేస్తాం. 2017, 2018 నుంచి ప్రభుత్వం రాయితీని ఎత్తేసింది. రైతుల ఇబ్బందులను మరోమారు ఉన్నతాధికారులకు వివరించి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం.
– జాన్‌సుధాకర్, డీఏఓ, నారాయణపేట
●

సబ్సిడీపై ఇవ్వాలి