
అసలు వస్తదో.. రాదో..
మొదటి విడతలో భాగంగా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ఆన్‌లైన్‌లో ఇసుక బుక్ చేస్తే.. రావడానికి నెల రోజులు పట్టింది. దీంతో నిర్మాణం నెమ్మదిగా సాగింది. తుమ్మిళ్ల రీచ్ పక్కనే ఉన్నా.. చాలా రోజులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఏవేవో సాకులు చెబుతున్నారు. రాజకీయ కారణాలతోనే ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రెండో దశలో ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. అసలు వస్తదో.. రాదో, వస్తే.. ఎప్పుడొస్తదో.. తెలియని పరిస్థితి ఉంది. దీంతో ఏం చేయాలో తోచడం లేదు.
– సోమేష్, రాజోళి