ఇంటర్ పరీక్షలకు104 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో శనివారం కొనసాగిన ఇంటర్ సప్లిమెంటరీ మూడో రోజు పరీక్షకు మొత్తం 104మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం పరీక్షలకు జనరల్ విభాగంలో మొత్తం 1844 మంది విద్యార్థులకుగాను 1,765 మంది విద్యార్ధులు హాజరయ్యారు.79 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 53 మందికి 53మంది హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ విభాగంలో 497మందికి 473 మంది హాజరుకాగా.. 24 మంది గైర్హాజర్ అయ్యారు. ఒకేషనల్ విభాగంలో 37 మందికిగాను 36 మంది హాజరయ్యారని డీఐఈఓ సుదర్శన్‌రావ్ తెలిపారు.
కోర్టు ఏర్పాటుకు
భవనం పరిశీలన
మక్తల్: పట్టణంలో కోర్టు ఏర్పాటు కోసం ఎంపిక చేసిన భవనాన్ని జిల్లా జడ్జి బోయ శ్రీనివాసులు శనివారం పరిశీలించారు. కోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. త్వరల్లో మక్తల్‌లో కోర్టును ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో న్యాయవాదులు దత్తత్రేయ, సూర్యప్రకాస్, అడేం శ్రీనివాసులు, సురేందర్, రాంమోహ్మన్, ఆనంద్, నవీన్‌కుమార్, సునీత, భాస్కర్ , సౌమ్య పాల్గొన్నారు.
మొక్కుబడి విధానానికి స్వస్తి చెప్పాలి
నారాయణపేట రూరల్: ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మొక్కుబడి విధానాలకు స్వస్తి పలికి బాధ్యతగా నిధులు నిర్వర్తించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ వెంకట నర్సమ్మ అన్నారు. మండలంలోని జాజాపూర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల శిక్షణ శిబిరాన్ని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల మధ్య విభేదాలు ఉండరాదని, ఈగో, మొహమాటం పక్కకు పెట్టేసి పనిచేయాలన్నారు. బడిలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులను చేర్చటానికి కృషి చేయాల్సిందిగా సూచించారు. తల్లిదండ్రులను మోటివేట్ చేయటానికి చొరవ చూపాలని, ప్రైవేట్‌లో జరిగే బోధన కంటే మిన్నగా ప్రభుత్ర పాఠశాలల్లో సౌకర్యాలు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్స్, మధ్యాహ్న భోజనంతో పాటు ఇటీవల ప్రవేశ పెట్టిన అధునాతన టెక్నాలజీతో కూడిన బోధన, కృత్రిమ మేధ, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ అంశాలను క్రోడీకరిస్తూ గ్రామాల్లో చైతన్యం తేవలని తెలియజేశారు. విద్యార్థుల సంఖ్యను కాపాడుకుంటూపోతే ఉపాధ్యాయుల పోస్టులు అలాగే ఉంటాయని, చేరికలు తగ్గితే నష్టం జరుగుతుందన్నారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను పాఠశాలలో అమలు చేసి విద్యార్థులను చురుకుగా తయారు చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఈఓ గోవిందరాజు, సీఎంఓ రాజేంద్ర కుమార్, డీఎస్‌ఓ భాను ప్రకాష్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు యాద్గీర్ జనార్దన్ రెడ్డి, యాదయ్య శెట్టి, ఆర్పీలు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
రసాయన మందులవాడకాన్ని నియంత్రించాలి
నారాయణపేట రూరల్: పంటలపై రసాయన మందుల వాడకాన్ని నియంత్రించాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు పరిమళకుమార్, సరిత అన్నారు. మండలంలోని సింగారం గ్రామ రైతు వేదికలో శనివారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్ సుధాకర్ అధ్యక్షతన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా వినియోగాన్ని తగ్గించి వాటి స్థానంలో పచ్చిరొట్ట ఎరువులు, వర్మీ కంపోస్టు, జీవన ఎరువులు వాడాలని తెలిపారు. అధిక రసాయన ఎరువులు వాడకం వల్ల కలిగే నష్టాలను రైతులకు వివరించి ప్రత్యామ్నాయంగా జీవ నాశినులు ఎరువులైన రైజోబియం, ట్రైకోడర్మా, సూడోమొనాస్ వంటివి వేసుకోవాలని సూచించారు. దీంతో భూమి సారవంతమైతుందని, అలాగే పర్యావరణాన్ని రక్షించాలని కోరారు. కార్యక్రమానికి హాజరైన రైతులకు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం కరపత్రాలు విడుదల చేసి రైతుల పంపిణీ చేశారు. బాలదినకర్, అనిరుధ్, అనిల్, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు104 మంది గైర్హాజరు


