
ప్రజాసేవకే అంకితం
నారాయణపేట రూరల్: నా జీవితం ప్రజాసేవకే అంకితమని పాలమూరు ఎంపీ డీకే అరుణ అన్నారు. ఆదివారం ఎంపీ జన్మదిన వేడకలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యయాదవ్ ఆధ్వర్యంలో నారాయణపేటలో ఘనంగా నిర్వహించారు. ఎంపీ హాజరై కేక్ కట్ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. తనపై అభిమానంతో ప్రజల ప్రాణాలు కాపాడే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రక్తదానం చేయడం ప్రాణదానం చేయడమేనని అన్నారు. అంతకుముందు ఎంపీని గజమాల, శాలువాలతో నాగురావు నామాజీ, రతాంగ్ పాండురెడ్డి, విఎస్.విజయ్ కుమార్, లక్ష్మీకాంత్‌రెడ్డి, గోవర్ధన్ గౌడ్, పున్నం చంద్ లాహోటి, పడాకుల శ్రీనివాసులు, నందు నామాజీ సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.