
ఇంటర్ పరీక్షలకు44 మంది గైర్హాజరు
నారాయణపేట ఎడ్యుకేషన్: జిల్లాలోని 11 పరీక్ష కేంద్రాల్లో గురువారం కొనసాగిన ఇంటర్ సప్లిమెంటరీ రెండో రోజు పరీక్షకు మొత్తం 44మంది గైర్హాజరయ్యారు. ఉదయం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షకు జనరల్ విభాగంలో మొత్తం 780 మంది విద్యార్థులకు గానూ 742 మంది విద్యార్థులు హాజరయ్యారు. 38 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో మొత్తం 53 మందికి 52 మంది హాజరయ్యారు. అలాగే, మధ్యాహ్నం జరిగిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విభాగంలో 79 మందికిగాను 74 మంది హాజరయ్యారు. ఐదుగురు గైర్హాజరయ్యారని డీఐఈఓ సుదర్శన్‌రావ్ తెలిపారు.
క్రీడా అకాడమీప్రవేశాలకు ఎంపికలు
నారాయనపేట ఎడ్యుకేషన్: రాష్ట్ర క్రీడా ప్రాదికార సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్రీడా, వసతి గృహల్లో 2025–2026 సంవత్సరానికిగానూ ప్రవేశాలకు ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన సర్వీసులు, క్రీడాల శాఖాధికారి వెంకటేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హులైన క్రీడాకారులు జూన్ 12, 13న రెండు రోజుల పాటు మహబూబ్‌నగర్ మెయిన్ స్టేడియంలో ఎంపికలు నిర్వహిస్తారని, ఆసక్తి గల క్రీడాకారులు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని తెలిపారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,281
జడ్చర్ల/నవాబుపేట: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం మొక్కజొన్నకు గరిష్టంగా రూ.2281, కనిష్టంగా రూ.1,501 ధరలు లభించాయి. ఆముదాలు రూ.6,066, చింతగింజలు రూ.3,457, హంస రకం ధాన్యం గరిష్టంగా రూ.1,701, కనిష్టంగా రూ.1,629, ఆన్‌ఎన్‌ఆర్ రకం గరిష్టంగా రూ.2,159, కనిష్టంగా రూ.1,609, వేరుశనగ గరిష్టంగా రూ.5,326, కనిష్టంగా రూ.4,431 ధరలు లభించాయి. నవాబ్‌పేట మార్కెట్‌కు శుక్రవారం 11వేల బస్తాల ధాన్యం వచ్చింది. సీడ్ (1010) ధాన్యం రూ.1967 ధర పలకగా.. ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,296, కనిష్టంగా రూ.1944 ధర లభించింది.
జూరాలకు 5,609 క్యూసెక్కుల వరద
ధరూరు: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద శుక్రవారం స్వల్పంగా తగ్గినటు్‌ల్ పీజేపీ అధికారులు తెలిపారు. ఎగువన స్థానికంగా కురుస్తున్న వర్షాలతో రెండ్రోజులుగా ప్రాజెక్టుకు స్వల్పంగా వరద వస్తున్న విషయం తెలిసిందే. గురువారం 8,953 క్యూసెక్కుల వరద వస్తుండగా.. శుక్రవారం సాయంత్రానికి 5,609 క్యూసెక్కులకు తగ్గినట్లు వివరించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 4.657 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.
దేశ సమైక్యత కోసమే జైసంవిధాన్ యాత్ర
పెద్దకొత్తపల్లి: దేశ సమైక్యత కోసమే జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ యాత్ర చేపట్టామని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం మండలంలోని కల్వకోల్ గ్రామంలో కొనసాగిన జైసంవిధాన్ యాత్రలో ఆయన పాల్గొన్నారు. ముందుగా స్థానికంగా బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి యాత్ర ప్రారంభించగా.. చెన్నపురావుపల్లి గ్రామం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆలిండియా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జై బాపు.. జై భీమ్.. జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్‌గౌడ్, నాయకులు నర్సింహ, విష్ణువర్ధన్‌రెడ్డి, గోపాల్‌రావు, మధు, వెంకటస్వామి, శివకుమార్‌రావు, చిన్నయ్య, ఎల్లయ్య కృష్ణయ్య పాల్గొన్నారు.

ఇంటర్ పరీక్షలకు44 మంది గైర్హాజరు