
జాతీయ స్థాయిలో సత్తా చాటాలి
నారాయణపేట ఎడ్యుకేషన్: విద్యార్థులు సమ్మర్ క్యాంప్‌ను సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని, జాతీయ స్థాయిలో సత్తా చాటాలని డీఈఓ గోవిందరాజులు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ స్టేడియంలో హైదరాబాద్, మహబూబ్‌నగర్ క్రికెట్ అసోషియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నెల రోజుల ఉచిత క్రికెట్ సమ్మర్ క్యాంప్‌లో పాల్గొని మాట్లాడారు. క్రీడా రంగంలో రాణించడం వల్ల భవిష్యత్‌లో ఉద్యోగ కల్పనలో స్పోర్ట్స్ కోటాలో అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. అదే విధంగా శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారన్నారు. జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో పాల్గొని భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో సత్తా చాటి జిల్లాకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ, జిల్లా విద్యా శాఖ ఏఎంఓ నాగార్జున రెడ్డి, ఖేలో ఇండియా అథ్లెటిక్ కోచ్ హారిక దేవి, క్రికెట్ కోచ్ అజయ్, క్రీడాకారులు పాల్గొన్నారు.
కళలకు జీవం
నారాయణపేట రూరల్: సాంప్రదాయ శాసీ్త్రయ కళలకు జీవం పోస్తున్నది బాలకేంద్రాలే అని, చిన్నారులు తమకు నచ్చిన కళల్లో శిక్షణ తీసుకోవాలని డీఈఓ గోవిందరాజు అన్నారు. శుక్రవారం బాలకేంద్రాన్ని ఆయన సందర్శించారు. శిక్షణ ఎలా ఇస్తున్నారంటూ విద్యార్థులను ఆరా తీశారు. చిన్నారులు చక్కటి కళలను నేర్చుకునేందుకు సహకరిస్తున్న సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎస్‌ఓ నాగార్జున్ రెడ్డి, బాలకేంద్రం సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, సంగ నర్సింహులు, వసంత్ కుమార్, జ్ఞానామృత రమణ పాల్గొన్నారు.