వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేతలు

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

డోన్‌: గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిలో టీడీపీ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క శాతం అభివృద్ధి జరగలేదని టీడీపీ సీనియర్‌ నాయకులు డోన్‌ మండలం నక్కవాగులపల్లెకి చెందిన తుమ్ముల కృష్ణన్న యాదవ్‌, గోపాల్‌, జనార్థన్‌ యాదవ్‌, షేక్‌ హసన్‌లు అన్నారు. సోమవారం వారు టీడీపీకి రాజీనామా చేసి స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి బుగ్గన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా పోటీ చేసే వారిని అఖండ మెజార్టీతో గెలిపించుకొని రావాలని బుగ్గన సూచించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు భాస్కర్‌రెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఇస్మాయిల్‌, రామ్మోహన్‌రెడ్డి, సోమయ్య, మనోహర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement