కార్య స్వరూపిణీ.. బ్రహ్మచారిణి దుర్గ | - | Sakshi
Sakshi News home page

కార్య స్వరూపిణీ.. బ్రహ్మచారిణి దుర్గ

Oct 13 2026 1:35 AM | Updated on Oct 13 2026 1:35 AM

మహానంది: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మహానందిలో సోమవారం రాత్రి శ్రీ కామేశ్వరీదేవి అమ్మవారు శ్రీ బ్రహ్మచారిణి దుర్గ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రారంభించిన కార్యాన్ని కొన సాగించడానికి సంకల్పం, నియమం, తపస్సు, బ్రహ్మచర్యం అవసరమని చూపించే స్వరూపిణి శ్రీ బ్రహ్మచారిణి దుర్గ అని మహానంది ఆలయ వేదపండితులు బ్రహ్మశ్రీ చెండూరి రవిశంకర అవధాని అన్నారు. చేతిలో కమండలం, జపమాలను కలిగిన అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల కార్యాలు నెరవేరతాయన్నారు. ఆలయ ఈఓ నల్లకాలువ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఉదయం నుంచి చండీహోమాలు, సువాసిని పూజ, శతచండీయాగం, పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఏఈఓ ఎరమల మధు, సూపరింటెండెంట్లు అంబటి శశిధర్‌రెడ్డి, పి,సుబ్బారెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగమల్లయ్య, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement