కల్లూరు: సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సోమవారం వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. రిమాండ్‌పై జిల్లా జైలులో ఉన్న ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని రామకృష్ణ ములాఖత్ ద్వారా కలిశారు. అనంతరం ఆయన కాటసాని రాంభూపాల్‌రెడ్డి నివాసానికి విచ్చేసి కాటసానిని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా వారు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. 1994 నుంచి 1999 వరకు ఇద్దరూ ఎమ్మెల్యేలుగా కలిసి పనిచేసిన నాటి రాజకీయ అనుబంధం, స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ పరస్పరం యోగక్షేమాలు తెలుసుకున్నారు. రాజకీయంగా భిన్న మార్గాల్లో ఉన్నప్పటికీ పాత రాజకీయ అనుబంధం, వ్యక్తిగత స్నేహానికి విలువ ఇస్తూ రామకృష్ణ కాటసాని నివాసానికి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.


