నేటి నుంచి ఎస్‌వీఆర్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎస్‌వీఆర్‌లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు

Oct 6 2026 1:36 AM | Updated on Oct 6 2026 1:36 AM

నంద్యాల(అర్బన్‌): స్థానిక అయ్యలూరు మెట్ట వద్ద ఉన్న ఎస్‌వీఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఈనెల 6, 7, 8 తేదీల్లో ప్రపంచ అంతరిక్ష వారోత్సవా లను నిర్వహించనున్నట్లు కళాశాల చైర్మన్‌ వెంకటరామిరెడ్డి, ఎండీ దినేష్‌రెడ్డిలు తెలిపారు. సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ శ్రీహరికోట భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభించే అంతరిక్ష వారోత్సవాలకు సంబంధించిన వాల్‌పోస్టర్లను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. అంతరిక్ష విజ్ఞానం, సాంకేతికతపై విద్యార్థులు, యువతలో అవగాహన పెంపొందించడంతో పాటు భవిష్యత్తు అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తిని పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. వారోత్సవాల్లో భాగంగా అంతరిక్ష ప్రదర్శన, ఇస్రో వీడియో, చిత్రలేఖనం, స్పేస్‌ క్విజ్‌, ఎక్స్‌టెంపోర్‌ స్పీచ్‌, ఫొటోగ్రఫీ, షార్ట్‌ ఫిలీమ్‌, పోస్టర్‌, డిజైన్‌ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్సాహంగా పాల్గొని అంతరిక్ష వారోత్సవాలను విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement