అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు | - | Sakshi
Sakshi News home page

అబద్ధాలతో ఇంకెన్నాళ్లు మభ్యపెడతారు

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

● రెండున్నరేళ్లు గడిచినా హామీలకు దిక్కులేదు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

● రెండున్నరేళ్లు గడిచినా హామీలకు దిక్కులేదు ● మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

డోన్‌: ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అబద్ధాలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మభ్యపెడతారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి కూటమి నేతలను ప్రశ్నించారు. తన స్వగృహంలో ఆదివారం నిర్వహించిన వైఎస్సార్‌సీపీ క్రీయాశీలక కార్యకర్తలకు పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి పనులంటూ ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారన్నారు. వార్డుకు రూ.10 లక్షల చొప్పున కేటాయించి మౌలిక వసతులు కల్పిస్తామని తిరిగి ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. రెండున్నరేళ్ల కూటమి పాలనలో ప్రజలకు చేసిన మేలేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిని పట్టణంలోని పలు వార్డులకు చెందిన వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తలు గజమాలతో సత్కరించారు. జిల్లా వలంటీర్‌ విభాగం అధ్యక్షులు పోస్ట్‌ ప్రసాద్‌ కార్యకర్తల తరఫున జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మల్లికార్జునరెడ్డి, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ జాకీర్‌ హుస్సేన్‌, పార్టీ నాయకులు కురుకుందు హరి, రాజ్‌ కుమార్‌, మల్యాల శ్రీనివాసరెడ్డి, గడ్డం సురేష్‌, మేకల రాజు,పెద్దయ్య, రంగస్వామి, ఎల్లేశ్వర్‌, క్యాలిటీ అబ్దుల్లా, కటిక మహేష్‌, వేణు, వలీ, వెంగళరెడ్డి, పండు, రవి, రవిరెడ్డి, రైల్వే నాగేంద్ర, కాలేషా, రాజు పాల్గొన్నారు.

చంద్రబాబు వైఫల్యాలను

ప్రజల్లోకి తీసుకెళ్దాం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పట్టణ, పల్లె ప్రజలకు విద్యా, వైద్యం, మౌలిక సౌకర్యాలు కల్పించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతు భరోసా కేంద్రాలను అందుబాటులోకి తెచ్చి రైతుల కష్టాలను పరిష్కరించారన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజల వద్దనే అందించేందుకు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి దశాబ్దాల కాలం నుంచి ప్రజలు ఎర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించిన ఘతన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందన్నారు. తమ ప్రభుత్వంలో కులం, మతం, వర్గం, రాజకీయ పార్టీలతో నిమిత్తం లేకుండా అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించామని మాజీ మంత్రి బుగ్గన గుర్తు చేశారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement