మూడు పూటలా తినడం కష్టమే | - | Sakshi
Sakshi News home page

మూడు పూటలా తినడం కష్టమే

Oct 5 2026 3:56 AM | Updated on Oct 5 2026 3:56 AM

మూడు పూటలా తినడం కష్టమే టీ, కాఫీ కూడా తాగలేని పరిస్థితి ధరలను తక్షణమే నియంత్రించాలి

గతంలో రూ. 500 తీసుకుని సంతకు వస్తే వారం రోజులకు సరిపడ సరుకులు, కూరగాయలతో పాటు సబ్బులు, శ్యాంప్‌లు తీసుకుని మిగిలిన చిల్లరతో పిల్లలకు స్వీ ట్లు, కారాలు తీసుకు వెళ్లేదాన్ని. రెండు, మూ న్నెళ్ల నుంచి రూ. 500 తెచ్చుకుంటే సగం సంచి కూడా నిండటం లేదు. ఇలాగైతే మూడుపూటల కడుపు నిండా తినడం కష్టమే. – శాంతమ్మ, పేరూరు

నాకు గుర్తున్నప్పటి నుంచి సంతకు వస్తున్నా. ఇంత దారుణంగా ధరలు పెరగడం ఎప్పుడూ చూడలేదు. చెక్కర, బెల్లం పరిస్థితి మరీ దారుణం. రూ. 40, రూ 50 ధర ఉంటేనే చూసుకుని వాడుకునేవారం, ఇప్పుడు అమాతం రూ. 70, రూ. 80 అంటే టీ, కాఫీతో పాటు పిల్లలకు స్వీట్లు ఏమి చేసి పెడతాం. ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – మోహిద్దీన్‌, ఎర్రగుంట్ల

ఏడాది కాలం నుంచి నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. సరుకుల కోసం దుకాణానికి వెళస్త్త్ర ఏది కొనాలో పాలుపోని దుస్థితి నెలకొంది. ఇటీవల కాలంలో ప్రతి నిత్యావసర వస్తువుపై రూ. 10 నుంచి రూ. 20 వరకు ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు విలవిల్లాడిపోతున్నారు. ధరలను తగ్గించి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

– రమణారెడ్డి, మాజీ సర్పంచ్‌, సౌదరదిన్నె, కోవెలకుంట్ల మండలం

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement