యువత చూపు వైఎస్సార్‌సీపీ వైపు | - | Sakshi
Sakshi News home page

యువత చూపు వైఎస్సార్‌సీపీ వైపు

Oct 2 2026 5:20 AM | Updated on Oct 2 2026 5:20 AM

బొమ్మలసత్రం: నంద్యాల నియోజకవర్గ యువత వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రకిశోర్‌రెడ్డి అన్నారు. గురువారం టీడీపీ నాయకుడు తాత మునిశేషిరెడ్డి మనవడు, ప్రముఖ వ్యాపారవేత్త రేగటి అనిల్‌కుమార్‌రెడ్డి టీడీపీకి చెందిన 500 మంది కార్యకర్తలు, స్నేహితులతో కలసి మాజీ ఎమ్మెల్యే శిల్పారవి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా శిల్పా రవి వారికి కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శిల్పా రవి మాట్లాడు తూ.. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదర్శ పథకాలను గుర్తుంచుకొని యువత పార్టీలోకి చేరుతుందన్నారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. కుల మతాలకతీతంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరిగేలా ఆయన కృషి చేశారన్నారు. గత ప్రభుత్వంలో నంద్యాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. పార్టీలో చేరిన వారి సేవలను గుర్తించి ఉన్నత పదవులు కల్పిస్తామన్నారు. పార్టీలో రేగటి అనిల్‌కుమార్‌రెడ్డితో పాటు సూరజ్‌ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, బాలాజీ రెడ్డి, రవితేజ, శివరాఘవ, ప్రదీప్‌రెడ్డి, కూరాకు శ్రీనివాస దత్తాత్రేయ, ఆంజనేయప్రసాద్‌, షణ్ముఖ, పవన్‌, రాఘవేంద్ర, అశోక్‌రెడ్డి, భార్గవ్‌, బాలకృష్ణ, నవీన్‌, మణి, మనోజ్‌, సూర్యప్రకాష్‌రెడ్డి, సందీప్‌కుమార్‌, కాసుల నవీన్‌, నాగరాజు, సుబ్రమణ్యం, రాజు, పవన్‌కల్యాణ్‌, సంపత్‌రాజ్‌కుమార్‌, బాలకృష్ణ, తదితరులు చేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement