పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటిసరఫరా | - | Sakshi
Sakshi News home page

పోతిరెడ్డిపాడు నుంచి తగ్గిన నీటిసరఫరా

Oct 1 2026 4:40 AM | Updated on Oct 1 2026 4:40 AM

● వారం రోజుల్లో నిలిచిపోయే ప్రమాదం

జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి నీటి సరఫరా తగ్గిపోయింది. కేవలం 2వేల క్యూసెక్కులు మాత్రమే 2,4,5,7 గేట్లు తెరచి ఎస్సారెమ్సీ కాల్వలోకి పంపుతున్నారు. ఈ నీటిని బానకచర్ల నీటినియంత్రణ వ్యవస్థ నుంచి జీఎన్‌ఎస్‌ఎస్‌ కాల్వకు సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు. ఈనెల 21తేదీ నాటికి శ్రీశైలం డ్యాంలో 858 అడుగుల నీటిమట్టం ఉండగా ప్రస్తుతం 854.20 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇప్పటిదాకా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ నుంచి 33 టీఎంసీల నీటిని మాత్రమే ఎస్సార్బీసీ, తెలుగుగంగ, కేసీఎస్కేప్‌ కాల్వలకు సరఫరా చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం నీటి వినియోగాన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోకపోతే మరో వారం రోజుల్లో శ్రీశైలం డ్యాంలో నీటిమట్టం 850 అడుగులకు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇలా అయితే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ ద్వారా నీటిసరఫరా నిలిచిపోయే ప్రమాదం ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

లింగనిర్ధారణ పరీక్షలు

చేస్తే జైలుకే

గోస్పాడు: లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే జైలు తప్పదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ శారదాబాయి హెచ్చరించారు. నంద్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ప్రైవేట్‌ ఆసుపత్రుల స్కానింగ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే లైసెన్సులు రద్దు చేస్తామన్నారు. సమాజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఆడబిడ్డ ముఖ్యమన్నారు. స్కానింగ్‌ సెంటర్లలో ధరల బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. కార్యక్రమంలో కమిటీ మెంబర్లు డాక్టర్లు రవీంద్రనాథ్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్‌, సలీమున్నీసా బేగం, పామన్న, నంద్యాల బర్డ్‌ ఎన్జీవో ప్రతినిధి వినయ్‌ బాబు, వంశీ పాల్గొన్నారు.

చెంచులకు

ఉచిత స్పర్శదర్శనం

శ్రీశైలంటెంపుల్‌: శ్రీశైల మల్లన్న ఉచిత స్పర్శ దర్శనాన్ని బుధవారం 259 మంది చెంచులకు కల్పించారు. శ్రీశైలం చెంచుగూడేంతో పాటు నంద్యాల జిల్లా నుంచి 45 మంది, మార్కాపురం జిల్లాల నుంచి 104 మంది, మాచర్ల నుంచి 110 మంది చెంచు భక్తులు శ్రీశైలం చేరుకున్నారు. తప్పెట వాయిద్యాలతో, నృత్యాలు చేస్తూ దర్శనానికి వచ్చారు. ఉమారామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద దేవస్థాన ఽఅధికారులు వీరికి ఆహ్వానం పలికారు. అనంతరం మల్లన్న స్పర్శదర్శనం, భ్రమరాంబాదేవి దర్శనం చేయించారు.

పొలంలోనే ఎద్దు మృతి

ఆత్మకూరురూరల్‌: సేద్యం చేస్తూ కాడిపైనే పడి ఎద్దు మృతి చెంది ంది. ఈ విషాద ఘటన ఆత్మకూరు మండలం నల్లకా ల్వ గ్రామ సమీప ంలో బుధవారం చో టుచేసుకుంది. రైతు రామాంజనేయులు తన పొలంలో సేద్యం చేయడానికి ఎద్దులను తీసుకెళ్లాడు. పొలంలోనే ఎద్దు మృతి చెందడంతో రైతుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కరువు కోరలకు చిక్కి అల్లాడుతున్న సమయంలో రూ.70 వేల విలువ చేసే దుక్కిటెద్దు హఠాత్తుగా మృతిచెందడంతో రైతు కుదేలయ్యాడు. సమాచారం తెలియగానే గ్రామంలోని రైతు భరోసా కేంద్రా నికి చెందిన వెటర్నరీ సహాయకుడు నారాయణాచారి ఘటనా స్థలానికి వెళ్లాడు. ఎద్దు కళేబరా న్ని పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేశాడు. నిరుపేద దళిత రైతు అయిన రామాంజనేయులును ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement