గ్రామ, వార్డు వలంటీర్లుగా విధులు నిర్వహిస్తున్న తమకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇస్తున్న రూ.5వేల వేతనాన్ని రూ.10వేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం మాట తప్పింది. ఉన్న ఉద్యోగాలు సైతం ఊడగొట్టి బజారులో పడే విధంగా చేసింది. ఇన్నాళ్లు వలంటీర్లుగా ఓ రకమైన జీవితాన్ని అనుభవించిన తమకు సమాజంలో చేదు అనుభవాలు ఎదురయ్యాయి. వలంటీర్లుగా చేసిన తమకు ఎక్కడ ఉద్యోగాలు దొరక్క ఇబ్బందులు పడ్డాం. చంద్రబాబు నెలకు రూ.10వేలు ఇస్తామని చెప్పి మోసం చేశాడు. చిన్న ఉద్యోగులను మోసం చేయడం తగదు. మమ్ములను విధుల నుంచి తొలగించి టీడీపీ, సోషల్ మీడియా కార్యకర్తలకు రూ.లక్షలు దోచిపెట్టాలని చూడటం దారుణం. ప్రభుత్వం పునరాలోచన చేయాలి. – పులిమద్ది శ్రీరాములు,
15వ వార్డు సచివాలయ మాజీ వలంటీర్


