అధికారులు అడ్డుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అధికారులు అడ్డుకోవాలి

Jul 28 2026 1:18 AM | Updated on Jul 28 2026 1:18 AM

అధికారులు అడ్డుకోవాలి భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం

కూటమి నేతల కనుసన్నల్లో కుందూలో జరుగుతున్న అక్రమ ఇసుక, మట్టి తరలింపును అధికారులు అడ్డుకోవాలి. యథేచ్ఛగా సహజ వనరులు తరలిపోతున్నా అధికారులకు తెలియకపోవడం దారుణం. కుందూ ప్రాంతంలో ఇసుక, మొరుసు అధికంగా ఉంటే టెండర్లు విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. కూటమి నేతల ఒత్తిళ్లకు భయపడి అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో భవిష్యత్‌లో కుందూనది ఒట్టిపోయే ప్రమాదం ఉంది. ప్రకృతి వనరులను కాపాడే బాధ్యత అధికారులదే.

– రఫీ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు, నంద్యాల

కుందూలో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండటంతో భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం ఏర్పడింది. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయి. అక్రమ తవ్వకాల కారణంగా నీటి ప్రవాహ సమయంలో ప్రవాహ దిశ మారి భూములు కోతకు గురవుతాయి. రైతులు చాలా నష్టపోవాల్సి వస్తుంది. కూటమి నేతల అక్రమాలకు అధికారులు అడ్డకట్ట వేయాలి. – రామచంద్రుడు,

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నంద్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement