పేద ప్రజల కడుపు కొడితే ఊరుకునేది లేదు
ప్రభుత్వం పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములను దుండగులు స్వార్థంతో చదును చేస్తున్నారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. సరిహద్దు రాళ్లు పాతిన భూముల్లో ఎవరి సహకారం, అండదండలతో తొలగించారని మండిపడ్డారు. పేద ప్రజల కడుపు కొట్టాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. టీడీపీ నేతల సహకారంతోనే ఇదంతా సాగుతోందన్నారు. ఇళ్ల స్థలాలను దౌర్జన్యంగా అక్రమించాలని తీవ్ర పరిణామాలు తప్పవన్నారు. పేద ప్రజల తరపున న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. ఆయన వెంట గ్రామ నాయకులు కె.టైలర్ రాముడు, వేణురెడ్డి, కృష్ణారెడ్డి, విసి స్వాములు, భాస్కర్, శీను, కార్పొరేటర్ నారాయణరెడ్డి, నాయకులు శివశంకర్‌రెడ్డి, కేశవరెడ్డి, హనుమంతురెడ్డి, శివారెడ్డి, తదితరులు ఉన్నారు.


