రూ.కోట్లలో ఆదాయం కోల్పోనున్న దేవస్థానం
శ్రీశైల దేవస్థానం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వ్యాపార దుకాణాలకు బహిరంగవేలం నిర్వహిస్తుంది. అయితే కొన్ని సందర్బాలో ప్రజాప్రతినిధుల సిఫార్స్, స్థానిక వ్యాపారుల విజ్ఞప్తి మేరకు మూడు సంవత్సరాల కాలపరిమితి పూర్తయిన తరువాత ప్రస్తుతం ఉన్న రెంట్‌కు 33శాతం పెంచి దుకాణాలు వారికే కేటాయిస్తారు. అలాగే మరికొన్ని సందర్భాలలో 50శాతం, 100శాతం అద్దె పెంచుతూ రెన్యువల్ చసిన సందర్బాలు ఉన్నాయి. అది కూడా దుకాణాల కాలపరిమితి పూర్తికాక ముందే వ్యాపారుల విజ్ఞప్తి మేరకు ఇలా చేస్తారు. ప్రస్తుతం 140దుకాణాల కాలపరిమితి పూర్తయింది. టెండర్లు సైతం నిర్వహించినప్పటికీ వాటిని అదే వ్యాపారులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. ఈ ప్రయత్నంతో దేవస్థానం ప్రతి ఏడాది రూ.కోట్లలో ఆదాయం కోల్పోనుంది.


