పశువుల అక్రమ రవాణా
● కేసు నమోదు చేసిన పోలీసులు
పత్తికొండ: పశువులను అక్రమంగా కబేళాకు రవాణా చేస్తున్న కంటైనరును విశ్వహిందూ పరిషత్ నాయకులు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున పత్తికొండ పట్టణ శివారులో చోటు చేసుకుంది. ఎమ్మిగనూర్ నుంచి తమిళనాడుకు పశువులను కంటైనరులో గత కొద్ది రోజుల నుంచిఅక్రమంగా తరలిస్తున్నట్లు హిందూ సంఘాల నాయకులకు సమాచారం వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి పత్తికొండ–ఆదోని రహదారిలో విశ్వహిందూ పరిషత్ నాయకులు కాపుకాశారు. అనుమానాస్పదంగా ఉండటంతో ఏపీ 39 టీఎస్ 7800 నంబర్‌గల కంటైనరు నిలిపి పరిశీలించారు. రెండు వరుస క్రమంలో పశువులను కంటైనర్‌లో తరలించడం గమనించి డ్రైవర్లును నిలదీశారు. పొంతన లేని సమాధానం రావడంతో అర్బన్ సీఐ జయన్నకు సమాచారం ఇచ్చా రు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


