రాష్ట్రంలో అరాచక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో అరాచక పాలన

Feb 3 2026 7:54 AM | Updated on Feb 3 2026 7:54 AM

రాష్ట్రంలో అరాచక పాలన

రాష్ట్రంలో అరాచక పాలన

ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా

బొమ్మలసత్రం: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, ప్రభుత్వ తీరును ప్రశ్నించి నేతల ఇళ్లపై గూండాలతో దాడులు చేయించడం ఇందుకు నిదర్శమని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా అన్నారు. తిరుమల లడ్డూపై వివాదాస్పద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన వారిపై, మాజీ మంత్రుల ఇళ్లపై దాడులకు పాల్పడిన నిందితులపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌మాబున్నిసా వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి సోమవారం వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఎస్‌ఐ డానియల్‌రాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పవిత్రమైన తిరుమల లడ్డూలో పంది కొవ్వు కలిసిందని కొంత కాలంగా అసత్య ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎన్‌డీఆర్‌ఐ, ఎన్‌డీడీబీ సర్వేలు పరీక్షలు జరిపి ప్రసాదంలో ఎలాంటి జంతు కొవ్వులు కలవలేదని నివేదిక ఇవ్వడంతో అధికార పార్టీ నేతల జీర్ణించుకోలేక పోతున్నారు. భక్తులకు క్షమాపణలు చెప్పాల్సింది పోయి ఇంకా శ్రీవారి ప్రతిష్టను భంగం కలిగించేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయటం దౌర్భాగ్యమన్నారు. వివాదాస్పద ఫ్లెక్సీలు తొలగించాలని కోరిన మాజీ మంత్రుల ఇళ్లపై టీడీపీ మూకలతో దాడులు చేయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆందోళనలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ గంగిశెట్టి శ్రీధర్‌, ఎమ్మెల్సీ తనయుడు హిరోజ్‌, రాష్ట్ర మహిళా విభాగం జనరల్‌ సెక్రటరీ శశికళారెడ్డి, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్‌రెడ్డి, మేధావుల సంఘం జిల్లా అధ్యక్షులు రసూల్‌ ఆజాద్‌, సెక్రటరీ దేవనగర్‌బాషా, జిల్లా ప్రచార కార్యదర్శి అనిల్‌ అమృతరాజ్‌, పార్టీ నాయకులు టీవై శివయ్య,కారు రవికుమార్‌, కలామ్‌బాషా, వహీద్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement