కూటమి సర్కారుపై ప్రజా వ్యతిరేకత
కర్నూలు (టౌన్): చంద్రబాబు పాలనపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయ కర్త, మాజీ పార్లమెంటు సభ్యులు బుట్టా రేణుకా అన్నారు. మంగళవారం స్థానిక బళ్లారి చౌరస్తా సమీపంలోని ఏపీఎస్‌పీ క్యాంపు వద్ద ఉన్న కార్యాలయంలో గంజిహాల్లి గ్రామానికి చెందిన 50 మంది టీడీపీ కార్యకర్తలు పార్టీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికి బుట్టా రేణుకా తో పాటు జిల్లా యాక్టివిటీ కార్యదర్శి నాగేష్ నాయుడు, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు డి. నజీర్ అహమ్మద్ వైఎస్సార్‌సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అమె మాట్లాడుతూ ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు ఆకర్షితులై వైఎస్సార్‌సీపీలో చేరుతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అలవి కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దె ఎక్కారని విమర్శించారు. రెండేళ్లు అవుతున్న ఇంకెప్పుడు ఆడబిడ్డ నిధి పథకం ఇస్తారని ప్రశ్నించారు. గోనెగండ్ల మండల గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు గంజిహాల్లి ముల్ల రఫీక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి స్వామిదాసు, ఏసన్న మత్తయ్య, యాకోబ్, సల్మాన్ రాజ్, ఆనంద్, రాజు, విజయ్, డేవిడ్, సుధాకర్, కిషోర్, మల్లిఖార్జున, చిన్న మునిస్వామి, రమేష్, బాస్కర్‌లతో పాటు 50 మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. పార్టీ చేనేత అధ్యక్షుడు ఎంకే శివప్రసాద్, ఎమ్మిగనూరు మండల యువజన విభాగం అధ్యక్షుడు బనవాసి బసిరెడ్డి, ఎమ్మిగనూరు పట్టణ 15 వ వార్డు ఇన్‌చార్జీ సయ్యద్ ఫయాజ్, నియోజకవర్గ సోషల్ మీడియా అధ్యక్షులు షరీఫ్, పూర్ణ నాయుడు, నరసింహ ఆచారి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ కర్నూలు
పార్లమెంట్ సమన్వయకర్త
బుట్టా రేణుకా
గంజిహాల్లి గ్రామానికి చెందిన
50 మంది టీడీపీ కార్యకర్తలు
వైఎస్సార్‌సీపీలో చేరిక


