తగ్గిన టమాటా ధర
ఆస్పరి: టమాటా ధర తగ్గిపోతుండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వారం రోజుల క్రితం 40 కిలోలు ఉన్న రెండు బాక్సులు కలిపి రూ.1,500 నుంచి రూ. 2వేలు వరకు ధర పలికాయి. కిలో టమాటా ఇక్కడే రూ.30 నుంచి రూ. 40 వరకు ధర పలికింది. బుధవారం ఆస్పరి మార్కెట్‌లో 50 కిలోలు ఉన్న రెండు బాక్సులు రూ. 575 లోపే పలకడం గమనార్హం. ప్రస్తుతం రూ.12 వరకు కిలో టమాటా ధర ఉంటోంది. వారం రోజుల్లోనే కిలో ధర రూ.28 వరకు తగ్గడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రస్తుతం ఆస్పరి, బిల్లేకల్లు టమాటా మార్కెట్లకు 72 క్వింటాళ్ల దాక దిగుబడులు విక్రయానికి వస్తున్నాయి.


