జనం కదం తొక్కారు.. కుటమి సర్కారు కుట్రలపై గళమెత్తారు. మ
బొమ్మల సత్రం: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ సోమవారం నంద్యాలలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో భారీగా ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన ప్రజా సంతకాల సేకరణ ప్రతుల బాక్సులను పార్టీ జిల్లా కార్యాలయం నుంచి విజయవాడకు తరలించారు. ఈ సందర్భంగా రైతుబజార్, పద్మావతినగర్ మీదుగా మునిసిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, పార్టీ రాష్ట్ర నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, వివిధ విభాగాల నాయకులు, ప్రజలు, విద్యార్థులు భారీగా పాల్గొన్నారు. యువకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పార్టీ జెండాలు, బ్యానర్లు ప్రదర్శించి జై జగన్, జోహార్ వైఎస్సార్ అంటూ నినాదాలు చేశారు.
ప్రైవేటీకరణ చేపడితే విద్యకు,
వైద్యానికి డబ్బులు చెల్లించాల్సిందే....
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తే విద్యతో పాటు నాణ్యమైన వైద్యానికి డబ్బులు చెల్లించాల్సిన దుస్థితి వస్తుందని జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కోటి సంతకాల సేకరణ ప్రతులతో నంద్యాలలో నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేద విద్యార్థులు ఒక్క రూపాయి కూడా ఖర్చులేకుండా వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారన్నారు. అలాగే పేదలకు మల్టీస్పెషాలిటీ వైద్యం ఉచితంగా అందాలన్నదే ఆయన లక్ష్యమన్నారు. అయితే టీడీపీ ప్రభుత్వం వైద్య విద్యను ప్రైవేటీకరిస్తే పేదలు ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. విలువైన కాలేజీల స్థలం, భవనాలు ప్రైవేట్‌కు అప్పగించడం సరికాదన్నారు. చిన్న రాష్ట్రాలు సొంతంగా మెడికల్ కళాశాలలు నడుపుతున్నాయన్నారు. ఏపీలో మాత్రం చంద్రబాబు ప్రైవేట్‌కు మేలు చేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సేకరించిన 4 లక్షల 20 వేల సంతకాల సేకరణ బాక్సులను ఈనెల 18 న జగనన్న ఆధ్వర్యంలో గవర్నర్‌కు అందిస్తామన్నారు.
తరలివచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులు
జిల్లా కేంద్రం నంద్యాలలో నిర్వహించిన ర్యాలీకి వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా, జెడ్పీ చైర్మన ఎరబోతుల పాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు సమన్వయకర్త దారా సుధీర్, మాజీ మార్క్‌ఫేడ్ రాష్ట్ర అధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, రాష్ట్రకార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, భూమా కిషోర్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, పీపీ మధుసూదన్‌రెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు కల్లూరి రామలింగారెడ్డి, గోపవరం సాయినాఽథరెడ్డి, చల్లా విఘ్నేశ్వర్‌రెడ్డి, పోచా జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ మాబున్నిసా, జిల్లా ఉపాధ్యక్షులు దాల్మిల్ అమీర్, సూర్యనారాయణరెడ్డి, రమేష్ నాయుడు, ప్రధాన కార్యదర్శులు సోమశేఖర్‌రెడ్డి, తిరుమలేశ్వరరెడ్డి, రాష్ట్ర మహిళా జనరల్ సెక్రెటరీ శశికళారెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాతమ్మ, యూత్ వింగ్ అధ్యక్షుడు గుండం నాగేశ్వరరెడ్డి, స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడు సురేష్‌బాబు లీగల్‌సెల్ అధ్యక్షుడు రామసుబ్బయ్య , మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టీవై శివయ్య, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, స్టేట్ మైనారిటీ జనరల్ సెక్రెటరీ అంజాద్ అలీ, మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి యూనూస్‌బాషా, ఎస్టీ సెల్ స్టేట్ జనరల్ సెక్రెటరీ శ్రీనివాసనాయక్, స్టేట్ యూత్‌వింగ్ సెక్రెటరీ శ్రీకాంత్‌రెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర విభాగం జనరల్ సెక్రెటరీ శంకర్, ఎంపీపీలు, జెడ్‌పీటీసీలు, కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు, సర్పంచులు, మండలాధ్యక్షులు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కోటి సంతకాల ప్రతుల బాక్సులను విజయవాడకు తరలించేందుకు వాహనంలో ఎక్కించి ఆ వాహనాన్ని జిల్లా అధ్యక్షుడు, పార్టీ నాయకులు జెండా ఊపి ప్రారంభించారు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు
వ్యతిరేకంగా ఉప్పెనలా
ప్రజా ఉద్యమం
కోటి సంతకాల సేకరణ ప్రతులతో
నంద్యాలలో భారీ ర్యాలీ
పెద్ద ఎత్తున పాల్గొన్న
వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే
ఊరుకోమని హెచ్చరిక
ర్యాలీలో పాల్గొన్న పార్టీ
జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు,
నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, ఎమ్మెల్సీలు
జనం కదం తొక్కారు.. కుటమి సర్కారు కుట్రలపై గళమెత్తారు. మ
జనం కదం తొక్కారు.. కుటమి సర్కారు కుట్రలపై గళమెత్తారు. మ
జనం కదం తొక్కారు.. కుటమి సర్కారు కుట్రలపై గళమెత్తారు. మ


