అర్జీదారులకు సత్వర న్యాయం
నంద్యాల: పీజీఆర్‌ఎస్‌లో వినతులు అందించిన వారికి చట్ట పరిధిలో సత్వర న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని తన కార్యాలయంలో ప్రజల నుంచి ఎస్పీ వినతులు స్వీకరించి మాట్లాడారు. ఫిర్యాదులపై పూర్తిస్థాయి విచారణ జరిపి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. నిర్ణీత గడువు లోపల ఫిర్యాదులను పరిష్కరించాలని, అలాగే అర్జీలు పునరావృతం కాకుండా చూసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విధుల పట్ల ఏ ఒక్కరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని సూచించారు.


