తనూజారెడ్డి అవయవదానం
మద్దికెరకు చెందిన కాంట్రాక్టర్ శంకర్‌రెడ్డి, పద్మావతిల కుమార్తె తనూజారెడ్డి ఎం. ఫార్మసి పూర్తి చేశారు. 12 ఏళ్ల క్రితం వివాహమైన కొన్నాళ్లకు ఇంటి మిద్దైపె వాకింగ్ చేస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆమెకు ఫిట్స్ వచ్చాయి. వెంటనే ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే కొంత సమయం వరకు మెదడుకు ఆక్సీజన్ అందకపోవడంతో బ్రెయిన్‌డెడ్ అయ్యింది. 2014 డిసెంబర్ 18న ఆమె అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకు వచ్చారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమె అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చారు.


