వైభవంగా గ్రామ దేవర
మంత్రాలయం రూరల్: మండల పరిధిలోని మంచాల లో బుధవారం గ్రామ దేవర వైభవంగా నిర్వహించారు. శ్రీమఠంలో వెలసిన మంచాలమ్మకు, గ్రా మా ల్లోని ఆలయాల్లో దుర్గదేవి మారికాంబ, సుంకలమ్మ, మారెమ్మకు మహిళలు పూర్ణ కుంభాలు సమర్పించారు. ఆలయాల్లో అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి, కుంకుమార్చన, మహా మంగళ హారతులు ఇచ్చారు. మంచాల పాత ఊరు, రాఘవేంద్ర నగ ర్, రామచంద్ర నగర్‌లో ఇంటింటా నైవేద్యం సమర్పించారు. శ్రీ మఠం దగ్గర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఐ రామాంజులు, పోలీసులు బందోబస్తు నిర్వహించారు. యువకులు పొట్టేలతో కేరింతలు కొడుతూ పోటీలు ఢీ కొడుతూ ఆనందించారు. దేవాలయం దగ్గర భక్తులు శ్రీమఠం ఆధ్వర్యంలో లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు.


