అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు

Dec 16 2025 4:45 AM | Updated on Dec 16 2025 4:45 AM

అంగన్

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు

కర్నూలు(సెంట్రల్‌): అంగన్‌వాడీ కేంద్రాలతో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల ఆర్యోగ సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి అంగన్‌వాడీలకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లోని తన చాంబరులో అంగన్‌వాడీలు, సూపర్‌వైజర్లకు మంజూరైన 5జీ సెల్‌ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మట్లాడుతూ..జిల్లాలోని 1,886 మంది అంగన్‌వాడీలు, 73 మంది సూపర్‌వైజర్లు, 9 మంది బ్లాక్‌ లెవల్‌ కోఆర్డినేటర్లకు సెల్‌ఫోన్‌లు మంజూరైనట్లు చెప్పారు .ఈ ఫోన్లతో గర్భిణులు, బాలింతలు, చిన్న పిల్లల పోషణ, ఆరోగ్యం మెరుగుపడేలా చేయాలని సూచించారు. ఐసీడీఎస్‌ పీడీ విజయ, సీడీపీఓలు అనురాధ, రాజేశ్వరి, సూసర్‌వైజర్‌ అనూష పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి కర్నూలు, నంద్యాల జిల్లాల అధికారులు సత్వరం చర్యలు తీసుకోవాలని ఏపీఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌(ప్రాజెక్టు, ఐటీ) ఆదేశించారు. సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎపీఎస్‌పీడీసీఎల్‌ కార్యాలయం నుంచి డయర్‌ యువర్‌ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్నూలు, నంద్యాల జిల్లాల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని ఆయన రెండు జిల్లాల ఎస్‌ఈలను ఆదేశించారు. విద్యుత్‌ వినియోగదారులు డయల్‌ యువర్‌ కార్యక్రమానికే కాకుండా టోల్‌ప్రీ నంబర్లు 1912, 1800425155333 కు ఫోన్‌ చేసి సమస్యలను చెప్పవచ్చని సూచించారు. 91333 31912 నంబరుకు వాట్సాప్‌ ద్వారా కూడా సమస్యలను చాట్‌ చేయవచ్చని డైరెక్టర్‌ సూచించారు.

32 గొర్రెల అపహరణ

పాణ్యం: భూపనపాడు గ్రామంలో మేకలు, గొర్రెలు చోరీకి గురయ్యాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. ఈనెల 11వ తేదీన గ్రామానికి చెందిన దామరేకులు దేవసహయం (పాపన్న) 33మేకలు, గొర్రెలును మారెమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఉంచాడు. అదే రోజు అర్ధరాత్రి తర్వాత ముగ్గరు దొంగలు వాటిని ఎత్తుకెళ్లారు. ఉదయం బాధిత రైతు వెళ్లి చూడగా జీవాలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా దొంగలు జీవాలను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు మారెమ్మ గుడిలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయినట్లు గ్రామస్తులు తెలిపారు.

భారీగా గంజాయి పట్టివేత

ఎమ్మిగనూరురూరల్‌: మండల పరిధిలోని గుడేకల్‌ కొండ దగ్గర సోమవారం సాయంత్రం పోలీసులు దాడి చేసి గంజాయిని పట్టుకున్నట్లు డీఎస్పీ ఎంఎన్‌. భార్గవి పేర్కొన్నారు. సోమవారం రాత్రి స్థానిక రూరల్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ మాట్లాడారు. గుడేకల్‌ కొండ దగ్గర శ్రీ గురుదత్త ఆశ్రమము సమీపంలో దగ్గర గంజాయి అక్రమంగా విక్రయిస్తున్నారే సమాచారంతో అక్కడికి వెళ్లి దాడి చేసి నిందితులను అరెస్ట్‌ చేశామన్నారు. అరెస్ట్‌ చేసిన వారిలో నందవరం మండలం బండారు స్ట్రీట్‌కు చెందిన చిదిగే కృష్ణ, ఎమ్మిగనూరు టౌన్‌ శారద కమిటీ ప్రాంతానికి చెందిన తపాల్‌ అబ్దుల్లా, కడిమెట్ల గ్రామానికి చెందిన మాల గోరంట్లగోవిందు, పెద్దకడుబూరు మండలం కంబదలదిన్నెకు చెందిన కురవ తిక్కన్న, నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన బోయ గంగప్పలను ఉన్నట్లు చెప్పారు. వీరు నందవరం మండలం కనకవీడు పేట కు చెందిన బోయ గంగప్ప పొలంలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించామని తెలిపారు. కనకవీడు పేటకు వెళ్లి పొలంలో ఉన్న మొక్కలను తొలగించినట్లు చెప్పారు. నిందితులు ఆశ్రమం పక్కన బండరాళ్లపై గంజాయి మొక్కలను ఎండబెట్టి, గుర్తు తెలియని వ్యక్తులకు అక్రమంగా విక్రయించి సొమ్ముచేసుకునేవారిని తెలిపారు. నిందితులను నుంచి 5.490 కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. గంజాయిని పట్టుకోవటంలో రూరల్‌ సీఐ చిరంజీవి, రూరల్‌ ఇన్‌చార్జి ఎస్‌ఐ తిమ్మారెడ్డి, రూరల్‌ హెచ్‌సీ కృష్ణ, కానిస్టేబుల్స్‌ కె.తిప్పన్న, సర్వేశ్వరరెడ్డి, జి.తిప్పన్నలు బాగా పనిచేసినట్లు ఆమె చెప్పారు.

శ్రీశైలంలో అన్యమత

స్టిక్కర్‌తో వాహనం

శ్రీశైలం: శ్రీశైలం మహా క్షేత్రంలోకి దేవస్థానం టోల్‌గేట్‌ ద్వారా అన్యమత స్టిక్కర్‌ కలిగి ఉన్న వాహనంలోనికి ప్రవేశించడం కలకలం రేపింది. టోల్‌గేట్‌ వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఎంతమంది ఉన్నా చూడలేదా, లేక వారి కళ్లు కప్పి వచ్చిందా, వారు చూస్తుండగానే లోనికి ప్రవేశించిందా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అన్యమత స్టిక్కర్‌ కలిగి ఉన్న వాహనం ప్రధాన పురవీధిలోని నంది మండపం వద్ద కనిపించడంతో పలువురు సెల్‌లో ఫొటోలు తీసి దేవస్థానం అధికారులకు సమాచారమిచ్చారు.

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు 1
1/1

అంగన్‌వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement