స్టాఫ్‌నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
● రూ.1.50లక్షలు వసూలు చేశాడని
ఎస్పీకి ఫిర్యాదు
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టాఫ్‌నర్సు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి భాస్కర్ అనే వ్యక్తి రూ.1.50లక్షలు తీసుకుని మోసం చేశాడని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు స్థానిక బుధవారపేటకు చెందిన రోజారాణి అనే మహిళ ఫిర్యాదు చేశారు. సోమవారం కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 108 మంది ఫిర్యాదులు చేశారు. వీటిపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెప్పారు. కొన్ని ఫిర్యాదులు ప్రభుత్వ టీచర్ ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి కాంట్రాక్ట్ పద్ధతిన మున్సిపాలిటిలో గానీ, కోర్టులో గానీ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.50వేలు తీసుకుని మోసం చేశాడని, తనకు న్యాయం చేయాలని వన్‌టౌన్‌కు చెందిన యుగంధర్ ఫిర్యాదు చేశాడు.
●చిన్నకుమారుడు ఇర్ఫాన్ బాషా గత కొద్దిరోజులుగా కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడని, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని, అతని ఆచూకీ తెలిపి న్యాయం చేయాలని గడ్డ వీధికి చెందిన ఖమ్‌రున్నీసా కోరారు.
● తన మొబైల్‌కు పీఎం కిసాన్ పేరుతో ఒక నకిలీ లింక్ వచ్చిందని, తనకు తెలియకుండానే దానిని ఓపెన్ చేసి, తన బజాజ్ కార్డు నుంచి గుర్తుతెలియ ని వ్యక్తులు ఒక్కొక్కటి రూ.35వేలు విలువ చేసే మూడు సెల్‌ఫోన్లు కొనుగోలు చేశారని నిడ్జూరు గ్రామానికి చెందిన శివశంకర్ ఫిర్యాదు చేశారు.
● భర్త శాంతిరాజు తన పేరుపై రూ.20లక్షలు అప్పులు చేసి ఒక సంవత్సరం నుంచి కుటుంబాన్ని చూసుకోకుండా, తనను అనుమానిస్తూ వేదిస్తున్నాడని న్యాయం చేయాలని అశోక్‌నగర్‌కు చెందిన మనోరంజని ఫిర్యాదు చేశారు.
● ఆస్తులు పంచుకుని నడవలేని స్థితిలో ఉన్న తనను కుమారులు, కోడళ్లు చూసుకోవడం లేదని, బయటకు గెంటివేశారని క్రిష్ణగిరి మండలం అమకతాడు గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ ఫిర్యాదు చేశారు.


