పార్టీ బలోపేతానికి కృషి చేయాలి
బొమ్మలసత్రం: జిల్లాలో ఉన్న నాయకులను సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కృషి చేయాలని నంద్యాల పార్లమెంట్ పరిశీలకురాలు ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో రాష్ట్ర కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వాహించారు. ఈసందర్భంగా కల్పలతారెడ్డి మాట్లాడుతూ పార్టీ అధినేత పేదలకు చేసిన మంచిని ప్రతి నియోజకవర్గంలో ప్రజలుక వివరించి పార్టీపై అభిమానం కూడగట్టేలా చూడాలన్నారు. ప్రభుత్వం పేదలకు చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టే ప్రయత్నంలో నాయకులు, నియోజకవర్గ సమన్వయ కర్తలు పార్టీ అధినేత సూచనలను పాటించేలా చూడాలన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, సీనియర్ నాయకులు మలికిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, రాష్ట్రకార్యదర్శులు బుడ్డా శేషిరెడ్డి, భూమా కిషోర్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, పీపీ మధుసుదన్‌రెడ్డి, గుండం సూర్యప్రకాష్‌రెడ్డి, ఎస్‌ఈసీ సభ్యులు కల్లూరి రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


