నష్టపరిహారం చెల్లించాలి
ఈ ఏడాది రెండెకరాల పొలంలో మిరప, అర ఎకరా విస్తీర్ణంలో వరి సాగు చేశాను. భారీ వర్షాలు, వాగులకు వరద కారణంగా పంటలు దెబ్బతిని నష్టం వాట్లింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో నష్ట పరిహారం చెల్లించి ఆదుకుంది. అదే తరహాలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం దెబ్బతిన్న పంటలకు నష్ట పరిహారం అందించి ఆదుకోవడంతోపాటు తిరిగి పంటల సాగుకు ఉచితంగా విత్తనాలు సరఫరా చేయాలి. – రమణారెడ్డి, రైతు,
చిన్నకొప్పెర్ల, కోవెలకుంట్ల మండలం


