
చాలా ఆనందంగా
అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన భవనంలో కేంద్రీయ విద్యాలయాన్ని నిర్వహించడం డోన్ ప్రజల అదృష్టంగా భావిస్తున్నారు. గత రెండేళ్లుగా కలలు కన్న కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఇప్పుడు నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉంది. డోన్ ప్రజలు గర్వకారణంగా భావించే ఈ విద్యాలయం ఏర్పాటుకు విశేష కృషిచేసిన మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఎన్నటికీ మరిచిపోరు.
– ఖాజా, సౌత్‌సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ నాయకులు, డోన్
కేంద్ర ప్రభుత్వంలో తనకు ఉన్న పలుకుబడితో మాజీ మంత్రి బుగ్గన డోన్‌కు కేంద్రీయ విద్యాలయాన్ని సాధించిపెట్టారు. జిల్లా కేంద్రానికి తప్ప అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రానికి మంజూరు కాదనుకున్న విద్యాలయాన్ని అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సహకారంతో సాధించి చూపిన అనితర సాధ్యుడు మాజీ మంత్రి బుగ్గన. ఆయన కృషిని నియోజకవర్గ ప్రజలు ఎన్నటికీ మరిచిపోరు.
– రేగటి రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ, డోన్

చాలా ఆనందంగా