రూ. 6.83 లక్షల విలువ చేసే ఎరువుల విక్రయాల నిలిపివేత
ఎమ్మిగనూరు రూరల్: పట్టణంలోని సాయిరాం సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో మంగళవారం మండల వ్యవసాయాధికారి మదిరెపల్లి శివశంకర్, పట్టణ ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తనిఖీలు నిర్వహించారు. ఎరువుల అమ్మకాలు, రికార్డులు, పురుగు మందులను పరిశీలించారు. మాట్లాడుతూ దుకాణంలోని రికార్డులను, స్టాక్‌ను పరిశీలించగా ‘ఓ’ ఫామ్ ఇన్‌క్లూడ్ చేయకుండా మందులు విక్రయిస్తున్నట్లు గుర్తించి రూ.6,83,303 విలువ చేసే 13.129 మెట్రిక్ టన్నుల ఎరువుల విక్రయాలు నిలిపేశారు. డీలర్లు ఓ ఫామ్ ఇంక్లూడ్ చేయకుండా రసాయన, పురుగు మందుల ఎరువుల విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఓ శివశంకర్ హెచ్చరించారు.
కోడుమూరులో..
కోడుమూరు రూరల్: స్థానిక ఎరువుల దుకాణాలపై ఎస్‌ఐ ఎర్రిస్వామి తన సిబ్బందితో మంగళవారం దాడులు నిర్వహించారు. ఎరువుల దుకాణాల్లోని స్టాక్, సేల్స్ రికార్డులతోపాటు గోదాముల్లోని ఎరువుల నిల్వలను పరిశీలించారు. యూరియా, ఇతర ఎరువులను బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న దుకాణదారుల రికార్డులను స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. కాగా రికార్డులను స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ ప్రైవేట్ ఏజెన్సీలు, దుకాణదారులు తమ దుకాణాలను మూసివేసి నిరసన తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఎరువుల దుకాణాల్లో పోలీసుల సోదాలు ఏమిటని వాపోయారు.
ఎరువుల దుకాణాల తనిఖీ