
ఆధ్యాత్మిక ‘పరిమళాలు’
● మల్లన్న పూలతో అగరుబత్తీలు
శ్రీశైలం టెంపుల్: తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామి వారికి అలంకరించే, ఆర్జిత సేవలకు వినియోగించే పూలను, తులసితో అగరుబత్తీలు తయారు చేసి విక్రయిస్తున్నారు. ఆ స్ఫూర్తిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కొనసాగిస్తున్నారు. శ్రీశైల మహాక్షేత్రంలో కొలువుదీరిన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్ల దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు అలంకరించే, ఆర్జితసేవల్లో వినియోగించే పూలను, బిల్వపత్రాలను ఒకప్పుడు వ్యర్థంగా పడేసేవారు. ప్రస్తుతం వీటిని అగర్‌బత్తీలుగా మార్చడంతో ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతున్నాయి. స్వామివారి నిత్యకై ంకర్యానికి వినియోగించిన పూలు అగర్‌బత్తీలుగా.. గోశాల నుంచి వచ్చే వ్యర్థాలను ఆవుపేడ, గో పంచకం దూప్‌స్టిక్స్‌గా భక్తులను పరవశింపజేస్తున్నాయి.
నేత్రదానంతో అంధత్వ నివారణ
గోస్పాడు: నేత్రదానంతో అంధత్వ నివారణ సాధ్యమవుతుందని జిల్లా అంధత్వ నివారణ సంఘం కంటి వైద్యాధికారి డాక్టర్ కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. గోస్పాడు మండలంలోని యాళ్లూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా అంధత్వ నివారణ సంఘం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ జనాభాలో 15శాతం మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారన్నారు. మనిషి మరణించిన తర్వాత 4 నుంచి 6 గంటల్లోగా నేత్రదానం చేయవచ్చన్నారు. నేత్రదాయం చేయదలిచిన వారు 1919, 104, 108 వైద్య ఆరోగ్య సిబ్బందిని సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డాక్టర్లు భారతి, కిరణ్, మూర్తి, క్రిష్టకిశోర్ గుప్త, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు సీఐలకు పదోన్నతి
కర్నూలు(టౌన్): కర్నూలు రేంజ్ పరిధిలో ఇరువురు సీఐలకు పదోన్నతి లభించింది. ఎమ్మిగనూరు రూరల్ సర్కిల్ సీఐగా పనిచేస్తున్న బీవీ మధుసూదన్ రావు, అలాగే మరో సీఐ బి.వి.శ్రీనివాసులుకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ బుధవారం డీజీపీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.