
ముమ్మరంగా సంతకాల సేకరణ
కర్నూలు(అర్బన్): కర్నూలు జిల్లాకు స్వర్గీయ దామోదరం సంజీవయ్య పేరును పెట్టాలని చేపట్టిన సంతకాల సేకరణ ఉద్యమం ముమ్మరంగా సాగుతోందని జిల్లా సాధన సమితి గౌరవాధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు అన్నారు. శుక్రవారం మిలాద్ ఉన్ నబీ పర్వదినంతో పాటు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభ జరుగుతున్న నేపథ్యంలో రాజ్‌విహార్, జిల్లా పరిషత్ ప్రాంగణంలో ముస్లింలు, వివిధ రాజకీయ, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సాధన సమితి ఆధ్వర్యంలో ఆయా ప్రాంతాల్లో కరపత్రాలు పంచుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఎస్సీ, ఎస్టీ లాయర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.జయరాజ్ ఉద్యమానికి మద్దతు తెలియజేశారు.