
మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ బీసీ సంక్షేమ వసతి గృహాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవని జిల్లా బీసీ సంక్షేమం, సాధికారత అధికారిణి కె.ప్రసూన హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆమె నగరంలోని రెండు బీసీ కళాశాల బాలికల వసతి గృహాలు, ఒక ప్రీ మెట్రిక్ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా వసతి గృహాల్లోని పరిసరాలను పరిశీలించి మరింత శుభ్రంగా ఉంచుకోవాలని వసతి గృహ సంక్షేమ అధికారులను ఆదేశించా రు. అలాగే వంట గది, స్టోర్ రూమ్‌ను తనిఖీ చేసి విద్యార్థుల కోసం వండిన వంటకాలను పరిశీలించా రు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని పలు హాస్టళ్లలో మెనూ సక్రమంగా పాటించడం లేదనే ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. తాను చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో ఎక్కడైనా విద్యార్థుల నుంచి ఫి ర్యాదులు వస్తే చర్యలు తప్పవన్నారు. ఈ నేపథ్యంలో నే ఆయా వసతి గృహాల్లోని విద్యార్థినులతో హాస్టళ్లలో అందుతున్న సౌకర్యాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు.