
ఆరు గ్రామాల్లోనే పంపిణీ..
బండి ఆత్మకూరు: మండలంలో 20 గ్రామపంచాయతీలో 27 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం తెల్లవారుజాము నుంచి పడిగాపులు కాశారు. అయితే మండలానికి ప్రభుత్వం 156 టన్నుల యూరియా మాత్రమే కేటాయించగా అది కూడా కేవలం బండిఆత్మకూరు, సంత జూటూరు, ఎరగ్రుంట్ల, పెద్దదేవలాపురం, భోజనం, సింగవరం రైతు భరోసా కేంద్రాలకు మాత్రమే సరఫరా చేయడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 రోజుల నుంచి ఎదురుచూస్తున్నప్పటికీ ఒక బస్తా కూడా ఇవ్వక పోతే ఎలా అంటూ మండిపడ్డారు. బండిఆత్మకూరులో రైతులు గుమికూడటంతో పోలీసులు వచ్చి రంగ ప్రవేశం చేసి టోకెన్లు ఇచ్చి పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు.