
13 నుంచి ఎద్దుల బలప్రదర్శన పోటీలు
గోనెగండ్ల: స్థానికంగా వెలసిన చింతలాముని, నల్లారెడ్డి స్వాముల వారి దశమి ఉత్సవాల సందర్భంగా గోనెగండ్ల ట్రాక్టర్స్ యూనియన్ సహకారంతో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి ఒంగోలు ఎద్దుల బలప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నట్లు ట్రాక్టర్స్ యూనియన్ నాయకులు ఉసేన్, శివన్న, నూర తెలిపారు. శుక్రవారం స్థానిక హైస్కూల్ ఆవరణలో పోటీల కరపత్రాలను విడుదల చేశారు. వారు మాట్లాడుతూ దశమి సందర్భంగా ఈనెల 13 నుంచి 15 తేదీ వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 13న నాలుగు పళ్ల విభాగం 14న ఆరు పళ్ల సైజు, 15న న్యూ కేటగిరి ఎద్దుల పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకులు తెలిపారు. వివరాలకు సెల్ 9949151807, 8522014358, 9394959515 నంబర్లలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు రహంతుల్లా, గోపాల్, వెంకటేష్, మాబు, భాస్కర్ పాల్గొన్నారు.