
ఎక్కువ చదివారని ఉద్యోగం ఇవ్వడం లేదు
ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో మేం ఫార్మా–డి కోర్సును పూర్తి చేశాం. ఎంబీబీఎస్‌తో సమానంగా సబ్జెక్టులు చదివి, ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి పట్టా తీసుకుని బయటకు వచ్చాం. ఇప్పుడు మాకు ఉద్యోగం ఇచ్చేవారే కరువయ్యారు. బి.ఫార్మాసీ అర్హతతో ఉన్న ఉద్యోగాలకు వెళితే మీరు చాలా ఎక్కువ చదివారని, ఈ ఉద్యోగం మీకివ్వలేమని చెబుతున్నారు. మాలాంటి వారి సేవలను ప్రభుత్వం ఉపయోగించుకోవాలి.
– డాక్టర్ ఎస్. లక్ష్మీకాంత్, ప్రెసిడెంట్ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఏపీ