
మరికొందరికి జీవితాన్నిస్తూ!
అవయవ దానం పట్ల పెరుగుతున్న అవగాహన
కర్నూలు జీజీహెచ్, రెండు ప్రైవేటు ఆసుపత్రులకు అవయవ మార్పిడికి అనుమతి
బ్రెయిన్ డెడ్ తర్వాతే అవయవాల సేకరణ
మట్టిలో కలిసిపోతూ
రక్తదానం, నేత్రదానంతో పాటు బ్రెయిన్‌డెడ్ అయిన వారి నుంచి అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చేందుకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ద్వారా అవసరమైన క్యాంపెయిన్ చేస్తున్నాము. ఇప్పటికే 30వేల మందితో అంగీకార పత్రాలు తీసుకున్నా ము. జిల్లాలో లక్ష మందితో అంగీకార పత్రాలు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. యూరప్ దేశా ల్లో మాదిరిగా ఇక్కడ కూడా బ్రెయిన్‌డెడ్ అయిన వారికి ప్రత్యేక ఐసీయూ ఉంటే బాగుంటుంది.
–డాక్టర్ కేజీ. గోవిందరెడ్డి, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా ఛైర్మన్, కర్నూలు
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి మాత్రమే అవయవాలను సేకరించి ఇతరులకు అమరుస్తారు. కిడ్నీలైతే బ్రెయిన్ డెడ్ అయిన వారి(కెడావర్),జీవించి ఉన్న వ్యక్తుల(లై వ్) నుంచి ఒక కిడ్నీని సేకరించి అవసరమైన వారికి అమరుస్తారు. ఇలా కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వారు కొంత కాలం పాటు ఇన్‌ఫెక్షన్ రాకుండా జాగ్రత్త పడితే జీవితాంతం హాయిగా జీవించవచ్చు.
–డాక్టర్ అబ్దుల్ సమద్, యురాలజిస్టు, కర్నూలు
నేను కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మేల్ స్టాఫ్‌నర్సుగా విధులు నిర్వహిస్తూ 2023లో ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ కో ఆర్డినేటర్‌గా శిక్షణ పొందాను. ఇప్పటి వ రకు ఐదుగురికి ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్‌లో అవయవాలు ఇచ్చేలా వారి కుటుంబాలను కౌన్సిలింగ్ చేసి ఒప్పించాము. ఒక బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి ద్వారా సేకరించిన అవయవాలతో 8 మంది జీవితాలలో వెలుగు నింపవచ్చు.
–టి.సంపత్, మేల్ స్టాఫ్‌నర్సు, జీజీహెచ్, కర్నూలు
కర్నూలు(హాస్పిటల్): అవయవదానమంటే ఇప్పటి కీ చాలా మందిలో అపోహలున్నాయి. మన అవ యవాలను బతికున్నప్పుడే సేకరించి ఇతరులకు అమరుస్తారని కొందరు, మరణించాక అవయవాలను తీస్తే వచ్చే జన్మలో సంబంధిత అవయవాలు లేకుండా జన్మిస్తారన్న మూఢనమ్మకంతో మరికొందరు అవయవదానానికి ముందుకు రావడం లేదు. ఇలాంటిి అపోహలను ఒకవైపు జీవనదాన్ ట్రస్ట్, మరోవైపు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీలు తమ వంతుగా అవగాహన కల్పిస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల కాలంలో అవయవదానం చేయడానికి చాలా కుటుంబాలు ముందుకు వస్తున్నాయి. ఈ మేరకు దాతలు ముందుకు వచ్చి తమ శరీర భాగాలను మరణానంతరం దానం చేసేందుకు అంగీకార పత్రాలు ఇస్తున్నారు. మరికొందరు వివిధ ప్రమాదాలు, అనారోగ్యాల సందర్భంగా బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబ సభ్యుల అనుమతితో వారి అవయవాలను సేకరిస్తున్నారు. మరికొందరు రక్తసంబంధీకుల కోసం వారి అవయవాలను దానం చేస్తున్నారు. ఈ మేరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు కర్నూలు కిమ్స్ హాస్పిటల్, మెడికవర్ హాస్పిటల్‌లకు అవయవాల సేకరణ, మార్పిడిలకు అనుమతి లభించింది. ఈ మేరకు ఆయా ఆసుపత్రుల్లో అవయవదాన, మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో రామాంజనేయులు, ఎస్తేరిరాణి, మల్లికార్జున, ఈరన్న, గిరిధర్‌లకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేశారు.
కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఇటీవల చేసిన కిడ్నీ మార్పిడి ఆపరేషన్ విజయవంతం అయినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు చెప్పారు. మంగళవారం ఆయన తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఐదుగురికి కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపారు. కిడ్నీతో పాటు గుండె, ఊపిరితిత్తుల మార్పిడికి సైతం అనుమతి వచ్చిందన్నారు. త్వరలో ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవగాహన
ఎవరైనా ఓ వ్యక్తి మరణించినా అతని గుండె స్పందిస్తుంది. ఊపిరితిత్తులు శ్వాసిస్తుంటాయి. నేత్రాలు వీక్షిస్తుంటాయి. మూత్రపిండాలు మరొకరిలో రక్తశుద్ధి చేస్తూనే ఉంటాయి. మరణించిన వ్యక్తి మన మధ్య లేకపోయినా అతని శరీరంలోని అవయవాలు మరొకరికి పునర్జన్మను ప్రసాదిస్తున్నాయి. మట్టిలో కలిసిపోతూ అవయవదానంతో మరొకరి జీవితాన్ని నిలుపుతుండటంతో ప్రస్తుతం అన్ని దానాల్లో కన్నా అవయవదానం గొప్పదిగా నిలిచింది. అవయవదాన అవగాహన పై ప్రత్యేక కథనం.
అవయవదానాలనుప్రోత్సహించేందుకు ప్రభు త్వం ఆధ్వర్యంలో జీవన్‌దాన్ ట్రస్ట్ పనిచేస్తుంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తుల సమాచారాన్ని ఈ ట్రస్ట్‌కు అందిస్తే వారు అవయవాలను సేకరించి అవసరం ఉన్న రోగులకు అమరుస్తారు. అయితే ఎవ్వరికై నా అవయవాలు కావాల్సి వస్తే ముందుగా ఈ ట్రస్ట్‌లో పేరు నమోదు చేసుకోవాలి. ప్రాధాన్యత క్రమాన్ని బట్టి సేకరించిన అవయవాలను నిపుణుల పర్యవేక్షణలో అవసరమైన వారికి అమరుస్తారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోనూ జీవన్‌దాన్ ట్రస్ట్ ప్రతినిధులను ఏర్పాటు చేశారు. వీరు ఎవరైనా బ్రెయిన్‌డెడ్ అయితే వారి కుటుంబ సభ్యులను అవయవదానానికి ఒప్పిస్తారు. కానీ ఇప్పటికీ చాలా మందికి బతికున్నప్పుడు అవయవాలను సేకరిస్తారనే అపోహ ఉంది. ఇది తప్పు. జీవించిఉన్నప్పుడు అవయవాలు తీయరు.

మరికొందరికి జీవితాన్నిస్తూ!

మరికొందరికి జీవితాన్నిస్తూ!

మరికొందరికి జీవితాన్నిస్తూ!