
ఆళ్లగడ్డ: బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకు ని అధికారంతో పాలనలో భాగస్వామ్యం చేసిన ఏకై క నేత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి అన్నారు. సామాజిక సాధికార బస్సు యాత్రలో భాగంగా మంగళవారం స్థానిక మహాలక్ష్మీ ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక ల మేనిఫెస్టోను పవిత్ర ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారన్నారు. అందరికీ న్యాయం చేయాలనే దృఢ సంకల్పంతో అర్హత కలిగిన ప్రతి విలేకరికి ఇంటి స్థలం ఇచ్చేందుకు నిర్ణయించారన్నారు. ఎన్‌టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి అధికారం చేపట్టిన బాబు బీసీలను నిట్టనిలువునా దగా చేశారన్నారు. అధికారంలో ఉన్నన్ని రోజులు ఆయన తన సామాజిక వర్గానికి తప్ప ఇతరులను ఎదగనీయలేదన్నారు. సీఎంగా జగన్ అధికారం చేపట్టిన రోజు నుంచే సామాజిక సాధికారత ఏంటో చూపించారన్నారు. బస్సు యాత్ర ఎక్కడికి పోయినా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వస్తే ఎలా వస్తారో జనం అలా ఆదరిస్తున్నారంటే సంక్షేమ పథకాలే కారణమన్నారు. ప్రపంచ చరిత్రలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పథకాలు లబ్ధిదారులకు అందుతున్నాయని, నగదు కూడా నేరుగా వారి ఖాతాల్లోకి చేరడం గొప్ప విషయమన్నారు. నవరత్నాల్లో భాగంగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటి వరకు పేదల అకౌంట్లో రూ.4.20 లక్షల కోట్లు జమ చేసిన ఘనత వైఎస్సార్‌సీపీకే దక్కిందన్నారు. ప్రత్యేకించి బీసీలకు రూ.1,62,593.6 కోట్లు, ఎస్సీలకు రూ.60,964.73 కోట్లు, ఎస్టీలకు రూ.17,134.84 కోట్లు, మైనార్టీలకు రూ.20,104 కోట్లు, ఇతర వర్గా ల్లోని పేదలకు రూ.1,14,734 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయడం ఆయా వర్గాలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. 30,50,000 ఇళ్లలో 16,60,500 ఇళ్లు కేవలం బీసీలకే ఇవ్వడం ఓ చరిత్రగా అభివర్ణించారు. బీసీలు, యాదవులు లేకుంటే టీడీపీ లేదని చెప్పిన చంద్రబాబు వారికి ఏమీ చేయలేదన్నారు. సీఎం జగన్ నేడు నలుగురు సోదరులను రాజ్యసభకు పంపిస్తే.. అందులో ఇద్దరు యాదవులు ఉండటం ఆయన ఆ వర్గానికి కల్పిస్తున్న ప్రాధాన్యత అర్థమవుతుందన్నారు. కంటి ఆపరేషన్ కోసం బయటకు వచ్చిన చంద్రబాబు భవిష్యత్‌లో గుండె, కిడ్నీ, క్యాన్సర్, బొల్లి ఆపరేషన్‌ల సాకుతో బెయిల్ కోరుతూనే ఉంటాడన్నారు.
మైనార్టీలకు పెద్దపీట
76 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక్క మైనార్టీ కూడా మంత్రిగా లేని కేబినెట్ ఏర్పాటు చేసిన ఘనుడు చంద్రబాబునాయుడు. నేడు జగనన్న మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించడంతో పాటు నాలాంటి వ్యక్తికి ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. నేడు ఎమ్మెల్సీలుగా నలుగురు ముస్లింలు ప్రాతినిధ్యం వస్తున్నారు. రానున్న ఎన్నికల్లో బక్క వాడికి, బలిసిన వాడికి మధ్య ఎన్నికలు జరుగనున్నాయి. – అంజాద్‌బాషా, డిప్యూటీ సీఎం
బీసీలకు ప్రాధాన్యం
రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఉంటే అందులో సగం బీసీలకు జగనన్న అవకాశం కల్పించారు. బీసీ వర్గానికి చెందిన మున్నూరు కాపునైన నాకు సీటు ఇచ్చి గెలిపించారు. బీసీలకు ఆయన చేసిన మేలు ఎంత చెప్పినా తక్కువే. ఉమ్మడి జిల్లాలో అన్ని సీట్లను వైఎస్సార్‌సీపీకి కట్టబెట్టి జగనన్నను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
– బెల్లన చంద్రశేఖర్, విజయనగరం ఎంపీ
Comments
Please login to add a commentAdd a comment