త్రిపురారం : మండలంలోని కామరెడ్డిగూడెం సర్పంచ్ పాపకంటి సుష్మ గుడిసెలో నివాసం ఉండడం.. ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై కలెక్టర్ చంద్రశేఖర్ శనివారం ఆరా తీశారు. ఈ నెల 9న ‘పూరి గుడిసెలో సర్పంచ్ నివాసం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన కలెక్టర్ కామరెడ్డిగూడెం సర్పంచ్ సుష్మ ఇందిరమ్మ ఇంటి స్టేటస్ తెలుసుకున్నట్లు తెలిసింది. కలెక్టర్ అప్రూవల్ సైతం పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. కాగా సర్పంచ్‌కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయినట్లు సర్పంచ్ పాపకంటి సుష్మ పేరు ఉన్న పత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కానీ, అధికారికంగా ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రం సర్పంచ్‌కు రావాల్సిఉంది.
సామ్రాజ్యవాదానికి
వ్యతిరేకంగా పోరాడాలి
నల్లగొండ టౌన్ : అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని సీసీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. శనివారం నల్లగొండలోని పీఆర్టీయూ భవన్‌లో నిర్వహించిన అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం(ఏఐపీఎస్‌వో) మహాసభలో ఆయన మాట్లాడారు. యుద్ధాల వల్ల మానవాళికి తీరని నష్టం వాటిల్లుతోందని, ప్రపంచ శాంతి సాధన కోసం ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తులన్నీ ఐక్యంగా ఉద్యమించాలని కోరారు. సామ్రాజ్యవాద విస్తరణ కాంక్షతో అమెరికా వంటి దేశాలు చిన్న దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
ఏఐపీఎస్‌ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కెవిఎల్.మాట్లాడుతూ అంతర్జాతీయ యుద్ధాల ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదని, భారతదేశ ఆర్థిక వ్యవస్థపైనా పడుతోందని వివరించారు. కార్యక్రమంలో అనంతుల శంకరయ్య, వెంకట్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నాగేశ్వరరావు, సమత, జిల్లా యాదయ్య, శ్యామల నాగసేనారెడ్డి, పసల శౌరయ్య, డాక్టర్ ఏఏ.ఖాన్, చలం రంగారావు, నేతి యాదగిరి, బుక్క ఈశ్వరయ్య, కోమటిరెడ్డి ప్రద్యుమ్నారెడ్డి, షరీఫుద్దీన్, కస్తాల వెంకన్న, తెలగమల దశరథ, బి.సప్న పాల్గొన్నారు.


