నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శనివారం రాత్రి లక్ష పుష్పార్చన ఘనంగా నిర్వహించారు. అమవాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజలు ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్ శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్‌శర్మ వైభవంగా నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈఓ మోహన్‌బాబు పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది ప్రత్యేక తీసుకున్నారు. గట్టుపైకి వాహనాలు అనుమతించలేదు. కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ వరాల రమేష్, డైరెక్టర్లు ప్రజ్ఞాపురం సత్యనారాయణ, కమ్మంపల్లి మల్లేశం, రేగట్టె శ్రీనివాస్‌రెడ్డి, మర్రి లింగస్వామి, ఇరుకుల సంపత్, యాదగిరి, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


