నల్లగొండ : జిల్లా పోలీస్ కార్యాలయంలో శనివారం 5వ తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో పాల్గొనే క్రీడాకారుల యాదాద్రి 5వ జోన్ స్థాయి ఎంపిక పోటీలను శనివారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచే క్రీడాకారులను ఎంపిక చేయడమే పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. ఎంపికై న క్రీడాకారులు రానున్న రాష్ట్రస్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి, పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్‌ఐలు సంతోష్, హరిబాబు, శ్రీను, పోలీస్ క్రీడాకారులు పాల్గొన్నారు.
కబడ్డీ ఆడుతున్న మహిళా పోలీసులు


