నల్లగొండ టౌన్ : ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నల్లగొండ బ్రాంచ్ ఎన్నికలు ఆదివారం నల్లగొండలో జరగనున్నాయి. సొసైటీలో 15 మంది కమిటీ మెంబర్ల ఎన్నికకు 32 నామినేషన్‌లు రావడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నల్లగొండలోని రెడ్‌క్రాస్ భవన్‌లో పోలింగ్ జరగనుంది. నాలుగు గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని రాత్రికి తుది ఫలితాలు వస్తాయి. పోలింగ్ ఏర్పాట్లను శనివారం ఎన్నికల అబ్జర్వర్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ ప్రేమ్‌కరణ్ రెడ్డి పరిశీలించారు. మొత్తం 1,385 మంది ఓటర్ల ఓట్లు వేసేందుకు గాను మూడు బూత్‌లు ఏర్పాటు చేసినట్లు జిల్లా సహకార అధికారి, పోలింగ్ అధికారి టి.మమత తెలిపారు. ఎన్నికలకు ఇద్దరు అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు, 16 మంది పోలింగ్ సిబ్బంది ఉంటారని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్టార్లు పి.ఆండాలు, మహమూద్, విజయ్, శివ, సిబ్బంది పాల్గొన్నారు.


