విద్యారంగంలో మార్పులకు భారీ పెట్టుబడులు | - | Sakshi
Sakshi News home page

విద్యారంగంలో మార్పులకు భారీ పెట్టుబడులు

Oct 7 2026 1:46 AM | Updated on Oct 7 2026 1:46 AM

మునగాల: విద్యారంగంలో శాశ్వత మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెడుతోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల, పౌరసరఫాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. మంగళవారం మునగాల మండలం ఎస్‌ఎంపేట రెవెన్యూ పరిధిలో రూ.9.60కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న అత్యాధునిక సెంట్రల్‌ కమ్యూనిటీ కిషెన్‌ షెడ్‌ శంకుస్థాపనలో కార్యక్రమంలో వారు పాల్గొని భూమిపూజ నిర్వహించారు. హారేకృష్ణ మూవ్‌మెంట్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగే ఈ కిషెన్‌షెడ్‌ ద్వారా జిల్లా వ్యాప్తంగా 1029 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో విద్యనభ్యసించే 60వేల మంది విద్యార్థులకు ప్రతిరోజు పౌష్టిక అల్పాహారం అందించనున్నట్లు వారు తెలిపారు. కార్యక్రమంలో హారేకృష్ణ చారిటబుల్‌ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు శ్రీసత్య గౌరచంద్ర దాస స్వామిజీతో పాటు కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌, ఎస్పీ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement