రైతు సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

రైతు సమస్యలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి

Oct 4 2026 10:25 AM | Updated on Oct 4 2026 10:25 AM

అలరించిన ఖవ్వాలి

నల్లగొండ టౌన్‌ : రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కోరారు. శనివారం నల్లగొండలోని సీపీఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. నవంబర్‌ 15 నుంచి 18వ తేదీ వరకు నల్లగొండలో అఖిల భారత కిసాన్‌ సభ 36వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మహాసభలను విజయవంతం చేసేందుకు రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా రైతు సంఘం నాయకులు, కార్యకర్తలు రైతుల ఇళ్లకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేస్తూ అవగాహన కల్పిస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొని పంటలు ఎండిపోతున్నాయని, పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంతో పాటు కరువు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. నాగార్జునసాగర్‌ ఎడమకాలువ నుంచి నీటిని విడుదల చేస్తే భూగర్భజలాలు పెరిగి బావులు, కుంటలు నిండి పంటలను కాపాడుకునే అవకాశం ఉంటుందన్నారు. సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు పోతినేని సుదర్శన్‌, రాష్ట్ర కార్యదర్శి తీగల సాగర్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, నారి ఐలయ్య, బండ శ్రీశైలం, ఎండీ.హాశం, కందాల ప్రమీల, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, దండంపల్లి సత్తయ్య పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement